ఒకే ఒక జీవితం || Oke Oka Jeevitham Lyrics in Telugu | Mr. Nookayya

గానం : ఒకే ఒక జీవితం
చిత్రం: Mr. నూకయ్య
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
పాడిన వారు: హరిచరణ్
సంగీతం: యువన్ శంకర్ రాజ

ఒకే ఒక జీవితం ఇది చేయిజారిపోనీకు
మళ్ళీరానీ ఈ క్షణాన్ని మన్నుపాలు కానీకు

కష్టమనేది లేని రోజంటు లేదుకదా
కన్నీరు దాటుకుంటు సాగిపోక తప్పదుగా....
అమ్మ కడుపు వదిలినా అడుగడుగు....
ఆనందం కోసమే ఈ పరుగు....
కష్టాల బాటలో కడవరకు....
చిరునవ్వు వదలకు....

నువ్వెవరూ నేనెవరూ రాసినదెవరు మన కథలు..
నువునేనూ చేసినవా మనపేరున జరిగే పనులు
ఇది మంచి అని అది చెడ్దదని తూకాలు వెయ్యగలవారెవరు
అందరికి చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడూ..
అవుతున్న మేలూ కీడూ.. అనుభవాలేగా రెండూ....
దైవంచేతి బొమ్మలేగ నువ్వునేను ఎవరైనా
తలో పాత్ర వెయ్యకుంటె కాలయాత్ర కదిలేనా
నడి సంద్రమందు దిగి నిలిచాకా....
ఎదురీదకుండ మునకేస్తావా....
నిను నమ్ముకున్న నీ ప్రాణాన్నీ....
ఆ దరికి చేర్చవా....

పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే
బతుకు అనే మార్గములో తన తోడెవరూ నడవరులే
చీకటిలో నిశిరాతిరిలో నీ నీడకూడ నిను వదులునులే
నీ వారు అను వారెవరు లేరంటు నమ్మితే మంచిదిలే...
చితివరకు నీతో నువ్వే..
చివరంట నీతో నువ్వే..
చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనే లేదనుకో
నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడ నీదనుకో...
లోకాన నమ్మకం లేదసలే....
దాని పేరు మోసమై మారెనులే....
వేరెవరి సాయమో ఎందుకులే....
నిను నువ్వు నమ్ముకో........

Comments

Popular posts from this blog

నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan

నా ప్రాణం నువ్వైపోతే || Naa Pranam Nuvvaipothe Lyrics in Telugu | Shopping Mall (2010)

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)