ఓ చెలియా.. నా ప్రియ సఖియా || O Cheliya Naa Priya Sakhiya Lyrics in Teugu | Premikudu

గానం : ఓ చెలియా.. నా ప్రియ సఖియా
చిత్రం: ప్రేమికుడు
సాహిత్యం: రాజశ్రీ
పాడిన వారు: ఉన్ని క్రిష్ణన్
సంగీతం: A.R.రెహమాన్


ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే......
నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే...
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే..

ఈ పూటా చెలి నా మాటా ఇక కరువై పోయెనులే
అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే..
వీక్షణలో నిరీక్షణలో అరక్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా.. నరకమా... ఏమిటొ తెలియదులే
ఈ జీవికీ జీవనమరణమూ నీ చేతిలో ఉన్నవిలే.....
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే

కోకిలమ్మా నువు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే..
వెన్నెలమ్మా నీకు జోల పాడి కాలి మెటికలు విరిచేనే...
వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే..
నా ఆశలా.. ఊసులే చెవిలోన చెబుతానే..
నీ అడుగులా చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే......
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే

ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే...
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే.....
ప్రేమంటె ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే......
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే....
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే...

Comments

Popular posts from this blog

నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan

నా ప్రాణం నువ్వైపోతే || Naa Pranam Nuvvaipothe Lyrics in Telugu | Shopping Mall (2010)

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)