శశివదనే శశివదనే || Sasivadane Sasivadane Lyrics in Telugu | Idharu
గానం : శశివదనే శశివదనే
చిత్రం: ఇద్దరు
పాడిన వారు: ఉన్ని క్రిష్ణన్, బాంబే జయశ్రీ
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
సంగీతం: A.R.రెహమాన్
శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ
రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా...
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా...
నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా..
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా..
మదనమోహిని చూపులోన మాండు రాగమేలా..
మదనమోహిని చూపులోన మాండు రాగమేలా..
పడుచు వాడిని కన్న వీక్షణ పంచదార
కాదా...
కలా ఇలా మేఘమాసం
క్షణానికో తోడి రాగం
కలా ఇలా మేఘమాసం
క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కట్టే నే ఇల్లే
శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
నెయ్యం వియ్యం ఏదేదైన తనువు నిలువదేలా..
నెయ్యం వియ్యం ఏదేదైన తనువు నిలువదేలా..
నేను నీవు ఎవ్వరికెవరం
వలపు చిలికెనేలా
ఒకే ఒక చైత్రవీణ పురె వీడి పూతలాయే
ఒకే ఒక చైత్రవీణ పురె వీడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో
జాబిలి హృదయం జత చేరే
నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా..
Comments
Post a Comment