శ్రీ రామదాసు - అల్లా... || Allaah... Lyrics in Telugu | Sri Ramadasu

గానం : అల్లా...
చిత్రం: శ్రీ రామదాసు
సాహిత్యం: వేదవ్యాస్
పాడిన వారు: శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాస్
సంగీతం: M.M.కీరవాణి

అల్లా.......
శ్రీరామా.....

శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ
కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనందనందనుడు అమృత రసచందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు..

తాగరా శ్రీరామ నామామృతం.., ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీరామ నామామృతం......, ఆ నామమే దాటించు భవసాగరం

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి....

ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేకచక్రవర్తి.....

ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామ చంద్రమూర్తి

తాగరా ఆ ఆ...................
తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం.....

పాపాప మపనీప మపనీప మపసనిప మాపామా
శ్రీరామా....

పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా
కోదండరామా...

మపనిసరి సాని పానీపామా
సీతారామా

మపనిసరిసారి సరిమరిస నిపమా
ఆనందరామా....

మా మా రిమరిమరిసరిమా
రామా... జయరామా...

సరిమా
రామా
సపమా
రామా
పా...వననామా

ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగామాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పు

ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపుతలపుల నేర్పు
ఆ వేల్పు దాసానుదాసులకు కై..మోడ్పు

తాగరా ఆ ఆ...................
తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం.....

Comments

Popular posts from this blog

నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan

నా ప్రాణం నువ్వైపోతే || Naa Pranam Nuvvaipothe Lyrics in Telugu | Shopping Mall (2010)

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)