ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే || yenno yenno varnala Lyrics in Telugu | Malli Malli Idhi Rani Roju
గానం : ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే
చిత్రం: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
సాహిత్యం: సాహితి
పాడిన వారు: కార్తిక్, చిన్మయి
సంగీతం: గోపి సుందర్
చిత్రం: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
సాహిత్యం: సాహితి
పాడిన వారు: కార్తిక్, చిన్మయి
సంగీతం: గోపి సుందర్
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై మెరిసెలే
మబ్బుల్లోని జాబిల్లె నా చెలీ నగుమోమై విరిసెలే
గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసే చలి చలి
ప్రేమ రాగాలూ ప్రణయ కలహాలూ నాకు నీవే.. నీవే...
వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్లు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హొయలే..
ఎన్నో ఎన్నో వర్ణాలా హరివిల్లే చెలి కళ్లై మెరిసెలే
మబ్బుల్లోని జాబిల్లె నా చెలీ నగుమోమై విరిసెలే
నీ కోసమే ఎదనే గుడిలా ఇలా మలిచె నామనసే
నీ కానుకై నిలిచే తనువే....
నవరసమే నీవంట
పరవశమై జన్మంత
పరిచయమే పండాలంట
ప్రేమై ఇంకా ఇంకా
మరి మరి నీ కవ్వింత
విరియగ నా వొళ్లంత
కలిగెనులే ఓపులకింత
ఎంతో వింతా
నువ్వువినా జగమునా
నిలుతునా ప్రియతమా
వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్లు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హొయలే..
ఎన్నో ఎన్నో వర్ణాలా హరివిల్లే చెలి కళ్లై మెరిసేలే
మబ్బుల్లోని జాబిల్లె నా చెలీ నగుమోమై విరిసెలే
గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసే చలి చలి
ప్రేమ రాగాలూ ప్రణయ కలహాలూ నాకు నీవే నీవే
వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్లు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హొయలే..
Comments
Post a Comment