గాలి వాలుగా || Gaali Vaaluga Lyrics in Telugu | Agnyaathavasi (2018)
గానం : గాలి వాలుగా
చిత్రం : అజ్ఞాతవాసి
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
పాడిన వారు : అనిరుధ్ రవిచందర్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
గాలి వాలుగా ఓ గులాబి వాలి
గాయమైనది.. నా గుండెకి తగిలి
తపించిపోనా.. ప్రతీ క్షణం ఇలాగ నీ కోసం
తరించిపోనా... చెలి ఇలా దొరికితె నీ స్నేహం
ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి
తేనె జడిలో ముంచేసావే
గాలులకు గంధం రాసి పైకి విసురుతావే
ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి
పడుచు ఎదలో దించేసావే
తలపునే తునకలు చేసి తపన పెంచుతావే
నడిచే హరివిల్ల.. నను నువ్విల్లా గురిపెడుతుంటె ఎల
అణువణువున విల విల మనదా ప్రాణం నిలువెల్లా..
నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్ల
సుకుమారి సొగసునలా ఒంటరిగా ఒదలాలా
చూస్తేనె
గాలి వాలుగా ఓ గులాబి వాలి
గాయమైనది.. నా గుండెకి తగిలి
తపించిపోనా.. ప్రతిక్షణం ఇలాగ నీ కోసం
తరించిపోనా... చెలి ఇలా దొరికితె నీ స్నేహం
కొర కొర కోపమేల
చుర చుర చూపువేళ
మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే
అరే అని జాలిపడవేం పాపం కదే ప్రేయసి
సరే అని చల్లబడవేం ఓసి పిశాచి
ఓహో అలా తిప్పుకుంటూ తూలి పోకే ఊర్వశి
అహో అలా నవ్వుతావే మీసం మెలేసి
ఎన్నాళ్లింకా ఊరికే ఊహల్లో ఉంటా పెంకి పిల్ల
చాలే ఇంకా మానుకో ముందువెనకా చూసుకో నీ పంతం
ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం
చాలు యుద్ధం రాజీకొద్దాం
కొద్దిగా కలిసొస్తే ఏవిటంట కష్టం
నడిచే హరివిల్ల.. నను నువ్విల్లా గురిపెడుతుంటె ఎల
అణువణువున విల విల మనదా ప్రాణం నిలువెల్లా..
నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్ల
సుకుమారి సొగసునలా ఒంటరిగా ఒదలాలా
ఏం చెయ్యాలోలే
గాలి వాలుగా ఓ గులాబి వాలి
గాయమైనది.. నా గుండెకి తగిలి
తపించిపోనా.. ప్రతీ క్షణం ఇలాగ నీ కోసం
తరించిపోనా... చెలి ఇలా దొరికితె నీ స్నేహం....
త రా ర రా రా.. త రా ర రా ర రా ర రా రా రా..
త రా ర రా రా.... త రా ర రా ర రా ర రా రా రా..
Comments
Post a Comment