నిజమేనా || Nijamena Lyrics in Telugu | Brindavanam (2010)
గానం : నిజమేనా
చిత్రం : బృందావనం
సాహిత్యం : అనంత శ్రీరామ్
పాడిన వారు : కార్తీక్, సుచిత్ర
సంగీతం : S.S.తమన్
నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా
ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా
నీ కలనే దాచుకున్నా నిజమల్లే వేచి ఉన్నా
నీకోసం ఇపుడే నేనే నువ్వవుతున్నా ప్రియా..
మరి నా లో ప్రాణం నీదంటున్నా..
wanna wanna be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటైపోనీ
wanna wanna be with you honey
నువ్వు నేను ఇక మనమైపోనీ
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నాదే...
తొలి ప్రేమే లోలో గుచ్చేస్తున్నాదే..ఓ
సర సర సర తగిలే గాలే నీ సరసకి తరిమేస్తోందే
అ ఆ ఏ హే.. అ ఆ ఏ హే
మునుపెరగని సంతోషాలే ఇపుడిపుడే మొదలవుతుంటే
అ ఆ ఏ..
చిరుగాలై నిన్ను చేరి ఊపిరిలో కలిసిపోయి
ఆ సంతోషాలే నీకే అందించెయనా ప్రియా..
నీ సొంతం అవుతా ఎప్పటికయినా
wanna wanna be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటైపోనీ
wanna wanna be with you honey
నువ్వు నేను ఇక మనమైపోనీ
గిర గిర గిర తిరిగే భూమి.. నీ చుట్టూ తిరగాలందే
అమ్మమ్మో....అమ్మమ్మో..
నిను మరవను అంటూ నన్నే నా ఆశలు కదిలిస్తుంటే
అమ్మమ్మో..
ఆశల్లో ఆగకుండా జన్మంతా జంటగుంటా
వదిలేసే ఊసే రాదే ఏదేమైనా ప్రియా..
ప్రతి నిమిషం నీతో అడుగేస్తుంటా...
wanna wanna be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటైపోనీ
wanna wanna be with you honey
నువ్వు నేను ఇక మనమైపోనీ
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నాదే...
తొలి ప్రేమే లోలో గుచ్చేస్తున్నాదే..ఓ
Comments
Post a Comment