నిలువద్దము నిను ఎపుడైనా || Niluvaddhamu Ninu Epudayna Lyrics in Telugu | Nuvvosthanante Nenoddhantana (2005)
గానం : నిలువద్దము నిను ఎపుడైనా
చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
పాడిన వారు : కార్తీక్, సుమంగళి
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిలువద్దము నిను ఎపుడైనా
నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించేనా
ఆ సంగతే కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
హే నిలువద్దము నిను ఎపుడైనా
నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా..
హా ప్రతి అడుగు తనకు తానే
సాగింది నీ వైపు నా మాట విన్నంటు నేనాపలేనంతగా
భయపడకు అది నిజమే
వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు
ఇది వరకు ఎద లయకు
ఏ మాత్రమూ లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నను అడుగు
చెబుతాను పాఠాలు నీ లేత పాదాలు జలపాతమయ్యేట్టుగా
నా దారినే మళ్లించగా నీకెందుకో అంత పంతం
మనచేతిలో ఉంటే కదా ప్రేమించడం మానటం
హే నిలువద్దము నిను ఎపుడైనా
నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా..
నువు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించేనా
ఆ సంగతే కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నా పేరుకి ఆ తియ్యదనం నీ పెదవే అందించేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
Comments
Post a Comment