ఓ మై లవ్ || Oh My Love Lyrics in Telugu | Prema Katha Chitram (2013)
గానం : ఓ మై లవ్
చిత్రం : ప్రేమ కథా చిత్రమ్
సాహిత్యం : కాసర్ల శ్యామ్
పాడిన వారు : లిప్సిక
సంగీతం : J.B.
ఓ మై లవ్ ఏ చోట ఉన్నా
నీడల్లే నీ వెంట ఉన్నా
నన్నే నేను నీలో చూస్తు ఉన్నా..
ఓ మై హార్ట్ ఏం చేస్తూ ఉన్నా
ఏదోలా నీ తోడు కానా
నువ్వే లేని నేనే నేను కానా...
నాలోన.. దాగున్న.. నీ ప్రేమ...
నీ దాకా చేరేది ఎలా...
మై లవ్ ఓ.. మై లవ్ ఓ.. ఓ మై లవ్
కలిసే ఆ విషయముకై ఎదురే చూస్తుందే
ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే..హే
నీ వల్లే కలవరమంతా.. మదినే తడిపేస్తుందే.. హే...
చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే...
నీవేగా నీవేగా నీవేగా.. నా చుట్టు నీవేగా
ఇలా మై లవ్ ఓ.. మై లవ్ ఓ.. ఓ మై లవ్
నువ్వే నా సొంతం అని ధీమా వస్తుందే
చొరవగనే వస్తున్నా చేరువ నీవుంటే.. హే
నువ్వున్నావన్న ధ్యాసే నన్నే నడిపిస్తుందే.. హే..
అందంగా ఉంది నాకే.. నువ్వే నేనవుతుంటే....
నీవేగా నీవేగా నీవేగా.. నేనంత నీవేగా ప్రియా..
మై లవ్ ఓ.. మై లవ్ ఓ.. ఓ మై లవ్
Comments
Post a Comment