పదర పదర || Padara Padara Lyrics in Telugu | Maharshi (2019)

గానం : పదర పదర
చిత్రం: మహర్షి
సాహిత్యం: శ్రీమణి
పాడిన వారు: శంకర్ మహదేవన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


భళ్ళుమంటు నింగి వళ్లు విరిగెను గడ్డిపరకతోన
ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకుపూల వాన
సముద్రమెంత దాహమేస్తె వెతికెను ఊటబావినే
శిరస్సువంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే

పదర పదర పదర నీ అడుగుకు పదును పెట్టి పదర
ఈ అడవిని చదువు చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదర ఈ పుడమిని అడిగి చూడు పదర
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా

హో.... హో.... హో.... హో....
నీ కథ ఇదిరా నీ మొదలిదిరా
ఈ పథమున మొదటడుగేయిరా
నీ తరమిదిరా అనితరమిదిరా
అని చాటేయ్ రా...

పదర పదర పదర నీ అడుగుకు పదును పెట్టి పదర
ఈ అడవిని చదువు చెయ్యి మరి వెతెకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదర ఈ పుడమిని అడిగి చూడు పదర
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా

ఓ.. భళ్ళుమంటు నింగి వళ్లు విరిగెను గడ్డిపరకతోన
ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకుపూల వాన
సముద్రమెంత దాహమేస్తె వెతికెను ఊటబావినే
శిరస్సువంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే

కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి
పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా
పగిలే ఇల హృదయం తన ఎదలో రోదనకి
వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా
కనురెప్పలలో తడి ఎందుకని తననడిగేవాడే లేక
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా

పదర పదర పదర ఈ హలమును భుజముకెత్తి పదరా
ఈ నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదర
పదర పదర పదర ఈ వెలుగను పలుగు దించి పదరా
పగుళ్ళతో పనుకిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా

నీలో ఈ చలనం మరి కాదా సంచలనం
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం
నీలో ఈ జడికి చెలరేగే అలజడికి
గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం
నీ ఆశయమే తమ ఆశ అని తమకోసమని తెలిసాక
నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా

పదర పదర పదర నీ గతముకు కొత్త జననమిదిరా
నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలి పునాది గది తలుపు తెరిచి పదరా
పదర పదర పదర ప్రతొక్కరి కథవు నువ్వు కదర
నీ ఒరవడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా

Comments

Popular posts from this blog

నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan

నా ప్రాణం నువ్వైపోతే || Naa Pranam Nuvvaipothe Lyrics in Telugu | Shopping Mall (2010)

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)