సైనికా || Sainika Lyrics in Telugu | Naa Peru Surya Naa Illu India (2019)

గానం : సైనికా
చిత్రం: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
పాడిన వారు: విశాల్ డడ్లాని
సంగీతం: విశాల్ శేఖర్ 

సరిహద్దున నువ్వు లేకుంటె
ఏ కనుపాప కంటినిండుగా నిదురపోదురా
నిలువెత్తున నిప్పుకంచెవై
నువ్వుంటేనే జాతి బావుటా ఎగురుతుందిరా
పైకెగురుతుందిరా
ఇళ్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా
సెలవే లేని సేవక ఓ సైనికా
పనిలో పరుగే తీరిక ఓ సైనికా
ప్రాణం అంత తేలిక ఓ సైనికా
పోరాటం నీకో వేడుక ఓ సైనికా

దేహంతో వెళ్లిపోదీ కథ
దేశంలా మిగిలుంటుందిగా
సమరం ఒడిలో నీ మరణం
సమయం తలచే సంస్మరణం
చరితగ చదివే తరములకు
నువ్వో స్ఫూర్తిసంతకం
పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా
పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనికా
గస్తీ దుస్తుల సాక్షిగా ఓ సైనికా
ప్రతిపూట నీకో పుట్టుకే ఓ సైనికా

బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు
ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు
తెగువగు ధీరుడివని బలమగు భక్తుడని
వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి
ఇళ్లే ఇండియా... దిల్లే ఇండియా...
ఇళ్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా
నువ్వో మండే భాస్వరం ఓ సైనికా
జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనికా
బతుకే వందేమాతరం ఓ సైనికా
నీవల్లే ఉన్నామందరం ఓ సైనికా

Comments

Popular posts from this blog

నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan

నా ప్రాణం నువ్వైపోతే || Naa Pranam Nuvvaipothe Lyrics in Telugu | Shopping Mall (2010)

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)