హే.. ఇది నేనేనా || Hey Idi Nenena Lyrics in Telugu | Solo Brathuke So Better (2020)

గానం : హే.. ఇది నేనేనా
చిత్రం : సోలో బ్రతుకే సో బెటర్
సాహిత్యం : రఘురామ్
పాడిన వారు : సిడ్ శ్రీరామ్
సంగీతం : S.S.తమన్

హే.. ఇది నేనేనా
హే.. ఇది నిజమేనా
ఆ.. అద్దంలోనా.. కొత్తగ కనపడుతున్నా..
ఈ.. సోలో బతుకే.. నువ్వొచ్చేసాకే
నన్నే తోస్తోందే కడదాకా నీ యెనకే

ధీం తోం తోం
ధీం తోం తోం
ధీం ధీం త న నా ధీం తోం తోం
గుండెల్లో మొదలయ్యిందే ధీం ధీం త న నా ధీం తోం తోం
ధీం తోం తోం
ధీం తోం తోం
ధీం ధీం త న నా ధీం తోం తోం
నన్నిట్టా చేరిందే ధీం ధీం త న న తోం

తెలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా
పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా
నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా
అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా
నీలాకాశం.. నా కోసం హరివిల్లై మారిందంట
ఈ అవకాశం.. చేజారిందంటే మళ్ళీ రాదంట
అనుమతినిస్తే.. నీ పెనిమిటినై ఉంటానే నీ జంట
ఆలోచిస్తే.. ముందెపుడో జరిగిన కథ మనదేనంట..

హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా
ఆ అద్దంలోనా.. కొత్తగ కనపడుతున్నా
ఈ.. సోలో బతుకే
నువ్వొచ్చేసాకే
నన్నే తోస్తోందే కడదాకా నీ యెనకే

మే నెల్లో మంచే పడినట్టు
జరిగిందే ఎదో కనికట్టు
నమ్మేట్టుగానే లేనట్టు.... ఓ.. ఓ...
వింటర్లో వర్షం పడినట్టు వింతలు ఎన్నెన్నో జరిగేట్టు
చేసేసావే నీమీదొట్టు... ఓ.. ఓ...
ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి
ఈవిధంగా ముందెపుడూ లేనే లేదే అమ్మాయి
హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా
ఆ అద్దంలోనా.. కొత్తగ కనపడుతున్నా
ఈ.. సోలో బతుకే
నువ్వొచ్చేసాకే
నన్నే తోస్తోందే కడదాకా నీ యెనకే

Comments

Popular posts from this blog

నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan

నా ప్రాణం నువ్వైపోతే || Naa Pranam Nuvvaipothe Lyrics in Telugu | Shopping Mall (2010)

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)