లాహే లాహే || Laahe Laahe Lyrics in Telugu | Acharya (2021)

గానం : లాహే లాహే
చిత్రం : ఆచార్య
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
పాడిన వారు : హారిక నారాయణన్ & సాహితి చాగంటి
సంగీతం : మణిశర్మ 

లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లే

కొండలరాజు బంగరుకొండ కొండజాతికి అండదండ
మద్దెరాతిరి లేచి మంగలగౌరి మల్లెలు కోసిందే
ఆటిని మాలలు కడత మంచుకొండల సామిని తలసిందే

లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లే

మెళ్లో మెలికల నాగుల దండ
వలపుల వేడికి ఎగిరిపడంగ
ఒంటి ఈబూది జలజల రాలిపడంగ సాంబడు కదిలిండె
అమ్మ పిలుపుకి సామి అత్తరు సెగలై విలవిల నలిగిండె

లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లే

కొరకొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన కుంకుం బొట్టు ఎన్నెల కాసిందే
పెనివిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే

ఉబలాటంగా ముందటికురికి
అయ్యవతారం చూసిన కలికి
ఏందా సెంకం సూలం బైరాగేసం ఏందని సనిగిందే
ఇంపుగ ఈపూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే

లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లే

లోకాలేలే ఎంతోడైనా
లోకువమడిసే సొంతింట్లోనా
అమ్మోరి గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమగల నడుమన అడ్డం రావులె ఇట్టాంటి నీమాలు

ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకి ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరేవేలకు మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగో జాముకి గుళ్లో గంటలు మొదలాయే

లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లే               ||2||

ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమొకమయ్యి ఏకం అవటం
అనాది అలవాటీల్లకి అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం

Comments

Popular posts from this blog

నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan

నా ప్రాణం నువ్వైపోతే || Naa Pranam Nuvvaipothe Lyrics in Telugu | Shopping Mall (2010)

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)